విశాఖలో ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. విశాఖలో పరిస్థితులకు సంబంధించి కేంద్ర హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖతో మోదీ మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. 
 
ప్రధాని మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు విశాఖ ఘటన గురించి కేంద్ర విపత్తు నిర్వహణ శాఖతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మోదీ సమీక్షకు దిగారంటే విశాఖలో పరిస్థితి విషమంగానే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 2000 మంది అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. కేంద్రం విశాఖకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపగా కొద్దిసేపటి క్రితం బలగాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశలున్నాయని అధికారులు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: