IHG

నిన్న జరిగిన విశాఖ గ్యాస్ లీకేజీ యావత్ భారత దేశాన్ని ఉలిక్కిపడేసాల చేసింది. ప్రజలందరూ తమ ఇళ్లలో మేడ మీద మరియు ఆరుబయట వేసవి తాపం కోసం కిటికీలు తెరచి నిద్రిస్తున్నవేళ ఒక్కసారిగా విషవాయువులు అలముకోవడంతో నిద్రిస్తున్న ప్రజలు అపస్మారక స్థితికి వెళ్లారు అయితే ఈ ఉక్కిరిబిక్కిరి గందరగోళంలో ప్రజలు తమ శ్వాస ఆడకపోవడంతో ఎక్కడి వ్యక్తులు అక్కడే విగతజీవులుగా పడిపోయారు. కాస్త స్మారకస్థితిలో ఉన్న ప్రజలు ప్రక్కనే ఉన్న వేరే ప్రాంతానికి వెళ్ళి తమ ప్రాణాలను కాపాడుకొనే ప్రయత్నం చేసినవాళ్లు రోడ్లపై అక్కడికక్కడే అపస్మారక స్థితికి వెళ్లారు అయితే కొందరు పూర్తిగా తమ తెలివిని కోల్పోయి ఏమిచేస్తున్నారో తెలియక బావుల్లో , కాలువల్లో పడి చనిపోయారు.

IHG

IHG

 

మరి మేడలపై నిద్రిస్తున్న వాళ్ళు క్రింద పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దృశ్యాలు చుసిన ప్రతి వక్కరికి గుండె బరువెక్కుతుంది. ఇదిలా ఉండగా ఇళ్లలో కట్టేసి ఉన్న పశువులు , కోళ్లు కూడా ఆ విష ప్రభావానికి లోనై అపస్మారక స్థితికి వెళ్లాయి. మరికొన్ని జీవులు చనిపోయాయి. అయితే విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి లీక్ అయిన వాయువులో స్థైరిన్ మోనోమర్ వల్ల ఈ దుష్పరిణామం జరిగిందని చెబుతున్నారు. ఈ విష వాయువు మొదటగా ఊపిరి తిత్తుల్లో చేరి ఊపిరితిత్తులను పనిచేయకుండా చేస్తుంది. అదేవిధంగా ఈ విషవాయువు చర్మం ద్వారా శోషించబడి శరీరంలోని అవయవాలు పాడయ్యే ఛాన్స్ ఉంది . మరి కొన్ని సందర్భాలలో క్యాన్సర్ కు దారి తీసే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. 

IHG

IHG

 

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: