విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై కేంద్ర‌ హోం శాఖా మంత్రి అమిత్ షా స్పందించారు. విశాఖ‌ ఘటన మనసును కలిచి వేసిందని ఆయ‌న ట్వీట్ చేశారు. ‘విశాఖ ఘటన నా మనసును కలిచి వేసింది. విపత్తు నిర్వహణ అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నా. మొత్తం వ్యవహారాన్ని మానిటర్ చేస్తున్నాం. బాధితులు అంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాన’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. ఇది వరకే ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు.

విశాఖ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. ఘటనకు సంబంధించి హోంశాఖ అధికారులు జిల్లా అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి .. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌తో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను విశాఖ పంపాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: