విశాఖప‌ట్నం ఆర్ ఆర్ వెంక‌టాపురంలోని ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమ నుంచి వెలువడిన స్టెరిన్ విష వాయువు క‌ల‌క‌లం రేపుతోంది. గురువారం తెల్ల‌వారుజామున లీకైన గ్యాస్‌తో వంద‌లామంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. బాధితులంద‌రూ చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు ప‌దిమందివ‌ర‌కు వ‌ర‌కు మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై ఇప్పటికే సహాయక చర్యలను మరింత వేగవంతం చేసింది. ఇలా దేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనపై స్పందిస్తూ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, ప్రధాని మోడీ, అమిత్‌షా త‌దిత‌రులు స్పందించారు. అలాగే ఏపీలో ఉన్న ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా స్పందించారు.

 

తాజాగా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా స్పందించారు. జనసేన పార్టీ తరపున ఘటన స్థలానికి త‌మ‌ పార్టీ జెనరల్ సెక్రటరీలు ఇద్దరు శివశంకర్, బొలిశెట్టి సత్యలను అక్క‌డికి పంపుతున్నాన‌ని ఆయ‌న‌ తెలిపారు. అలాగే అలాగే విశాఖ, ఉత్తర తీర ఆంధ్రలో పారిశ్రామిక రక్షణా ఆడిట్ ను పెట్టాలని, అలాగే పలు పరిశ్రమల వల్ల కాలుష్యం ఏర్పడ్డ జోన్లలో కూడా ఈ సేఫ్టీ ఆడిట్‌ను ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి క‌ఠినంగా వ్య‌వ‌హరించాల‌ని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: