విశాఖలో ఎల్జీ పాలిమ‌ర్స్ ప‌రిశ్ర‌మ‌లో గ్యాస్‌ లీక్‌ ఘటనపై‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంట‌నే ఆయ‌న అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ఈ ప్రమాదంపై అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. అనంత‌రం ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌ల‌ విశాఖకు సీఎం జ‌గ‌న్ చేరుకున్నారు. గ్యాస్ బాధితులు చికిత్స పొందుతున్న బాధితుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించనున్నారు. అనంత‌రం ఈ ఘ‌ట‌న‌పై ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. అక్కడ అందుతున్న సహాయక  చర్యలను సీఎం వైఎస్‌ జగన్‌ దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

అంతేగాకుండా.. ఆర్ ఆర్ వెంక‌టాపురం గ్రామంతోపాలు ప‌లు ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌టించి, స్వ‌యంగా ప్ర‌జ‌ల‌తో మాట్లాడే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా, అంత‌కుముందు జ‌రిగిన స‌మీక్ష స‌మావేశంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌తో సీఎం‌ జగన్‌ మాట్లాడారు. గ్యాస్ లీకేజీ గల కారణాలు, త‌దిత‌ర అంశాల‌పై సమీక్షించారు. తీసుకున్న సహాయ చర్యలతోపాటు.. ఆస్పత్రుల్లో బాధితులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: