ఏపీలో ఇప్ప‌టికే క‌రోనా కేసులు ఏకంగా 1800 క్రాస్ అయ్యి 2 వేల‌కు చేరుకుంటున్నాయి. క‌రోనాతో విల‌విల్లాడుతోన్న ఏపీకి ఇప్పుడు వైజాగ్ గ్యాస్ లీకేజ్‌తో స‌రికొత్త ముంపు పొంచుకు వ‌చ్చింది. అస‌లే వైజాగ్‌లో క‌రోనా తీవ్ర‌త త‌గ్గించేందుకు ప్రభుత్వం అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. ఇక వైజాగ్ క‌ష్టాల ప‌రంప‌ర అంటూ గురువారం ఉద‌యం గ్యాస్ లీక్ అవ్వ‌డంతో న‌గ‌రం ఒక్క‌సారిగా అత‌లాకుత‌లం అయ్యింది. వైజాగ్‌లోని గోపాలపట్నం పరిధి, ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో స్టెరీన్‌ వాయువు లీక్ అవ్వడంతో.. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా ఈ ప్ర‌భావం రెండు వేల మందికి ప్ర‌భావం చూపించింది.

 

ఇక  ఈ స్టెరీన్ గాలి ఎక్కువుగా పీల్చ‌డం వ‌ల్ల ఇప్ప‌టికే వంద‌లాది మూగ‌జీవాలు చ‌నిపోయాయి. కుక్క‌లు, పిల్లులు, ప‌క్షులు చివ‌ర‌కు ఎలుక‌లు సైతం మృత్యువాత ప‌డ్డాయి. ఇక స్టైరీన్ ప్ర‌భావం వ‌ల్ల మాన‌వ శీరారానికి ధీర్ఘ‌కాలిక రోగాలు కూడా వ‌స్తాయ‌ని తెలుస్తోంది. ఈ గ్యాస్ పీల్చ‌డం వ‌ల్ల ఊపిరితిత్తులు, ఎముక‌లు, కిడ్నీలు, గుండె సంబంధిత వ్యాధులు వ‌స్తాయ‌ని.. మ‌నిషి ఆరోగ్య ప‌రంగా పూర్తిగా బ‌ల‌హీన‌ప‌డిపోతాడు. ఈ గ్యాస్ పీల్చ‌డం వ‌ల్ల‌ కేంద్ర నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూసే అవకాశం ఉంది. కాస్త అటూ ఇటూగా భోపాల్ గ్యాస్ ప్ర‌మాదంలో మ‌నుషులు ఎలాంటి ధీర్ఘ‌కాలిక రోగాల‌కు గుర‌య్యారో ఇప్పుడు విశాఖ‌లో ప‌రిస్థితి విష‌మించితే అదే ప‌రిస్థితి త‌లెత్త‌నుంద‌న్న ఆందోళ‌నలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: