ఈరోజు తెల్లవారుజామున విశాఖలో గ్యాస్ లీకేజ్ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణతో ఇప్పటికే భయాందోళనతో గడుపుతున్న విశాఖ ప్రజలు గాఢ నిద్రలో ఉండగా ఉపద్రవం ముంచుకొచ్చింది. నిద్ర లేచే లోపు ఎవరు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
తాజాగా విశాఖ ఘటన గురించి కేంద్రం నుంచి సంచలన ప్రకటన వెలువడింది. ఈ ఘటనలో బాధితులు త్వరగా కోలుకోవడానికి  పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటన చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల సంఖ్య పెరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం తరపున విశాఖలో ప్రత్యేక బృందాలు పాల్గొంటున్నాయి. ఎన్డీఆర్ఎఫ్‌, ఎన్డీఎంఏ స‌భ్యుల‌తో కేంద్రం స్పెషల్ టీంను ఏర్పాటు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: