గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల పాలిమరైజేషన్ జరిగింది. ఇదొక మల్టీనేషనల్ కంపెనీ.. అయినప్పటికీ ఇలాంటి కంపెనీలో ఇలాంటి దుర్గటన జరగడం శోచనీయం అన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వమని చెప్పి  కలెక్టర్, సీపీతోకూడిన విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా.. ఏలా జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై కమిటీ లోతుగా అధ్యాయనం చేసి పూర్తి రిపోర్టు ఇస్తారని సీఎం జగన్ అన్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆ కంపెనిలకు సంబంధించి ఎం చేయాలి.. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది చూడాల్సి ఉంటుందని అన్నారు.  ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం అన్నారు.

 

అయితే ఇలాంటి సంఘటన జరిగినపుడు ఓ అలారం మోగుతుంది.. అలారం మోగకపోవడం కరెక్ట్ కాదు కదా అన్నారు. ఇది నా మనసు మరింత బాధపెట్టిన విషయం అన్నారు జగన్ మోహన్ రెడ్డి.  ఇదిలా ఉంటే..  విశాఖ గ్యాస్ లీకేజ్ పై ఎన్డీఆర్ఎఫ్‌, ఎన్డీఎంఏ సంయుక్తంగా ప్రకటన చేశారు.  బాధితులను రక్షించేందుకు.. ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దేందుకు  ఎన్డీఆర్ఎఫ్‌, ఎన్డీఎంఏ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ.  గ్యాస్ లీక్ ఘటనలో 9 మంది మృతి చెందినట్లు ప్రకటన.  వెయ్యి మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడి. ఇప్పటికే ప్రత్యేక బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: