IHG

డీకే బోస్ సినిమాతో తో మంచి హుషారుగా ఉన్న సందీప్ కిషన్ ...ఇవాళ హ్యాపీ బర్త్ డే జరుపుకుంటున్నాడు . ఈ సందర్భంగా పలువురు సినీ తారలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ జేశారు.ఇందులో భాగంగా మంచు లక్ష్మి తన విషెష్ ను తెలియజేసింది. అయితే విశేషం ఏంటి అంటున్నారా ...అయితే చుడండి తన ట్వీట్ లో హ్యాపీ బర్త్ డే సూరీ అని ట్వీట్ చేసింది . అయితే ట్వీట్ లో ఈ సూరీ  ఎవరా.. అన్న సందేహం నెటిజన్స్ తమ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

 

IHG

అసలు విషయం ఏమిటంటే సందీప్ కిషన్ మరియు మంచు లక్ష్మి ఇద్దరు కలసి గుండెల్లో గోదారి సినిమాలో ఆన్ స్క్రీన్ పై మంచి రొమాంటిక్ జోడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు  సూరీ ...అందుకని ఆ తీపిజ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మంచు లక్ష్మి తన ట్వీట్ ద్వారా తెలిపే ప్రయత్నం చేసిందనుకుంటున్నారు పలువురు. ప్రస్తుతం సందీప్ కిషన్ తన సొంత నిర్మాణంలో A1 ఎక్స్ ప్రెస్   అనే సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇందిలో లావణ్య త్రిపాఠి సందీప్ కు జోడి కట్టింది. రావు రమేష్ , మురళి శర్మ లో ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: