IHG

తెలుగులో అగ్రతారగా వెలుగొందిన హీరోయిన్ మరియు నటి సుహాసిని. ఆమె పేరుపొందిన డైరెక్టర్ మణిరత్నం గారికి స్వయానా భార్య. లాక్ డౌన్ నేపధ్యం లో పలువురు సినీ తారలు సాధారణ ప్రజలను చైతన్య పర్చడానికి ఎన్నో యాడ్స్ మరియు లఘు చిత్రాలను నిర్మించారు. అయితే సుహాసినీ మణిరత్నం చేసిన ఓ చిన్ని ప్రయత్నం సక్సెస్ అవ్వడంతో ఓ లఘు చిత్రాన్ని చేయడానికి సిద్ధమైంది. స్వీయ-ఒంటరితనం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ  కొడుకు నందన్‌తో ఆమె ఇటీవల చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆ వీడియో స్ఫూర్తి తో ఓ లఘు చిత్రాన్ని చేయబోతోంది .

IHG

ఆ లఘు చిత్రం పేరు  చిన్నంజీరు కిలియే గా నామకరణం చేసింది. ఇది ఓ 20 నిమిషాల నిడివికలిగిన వీడియో. అయితే ఓ వారం  రోజుల్లో ఈ లఘు చిత్రాన్ని విధుల చేస్తున్నట్లు తెలిపింది. ఈ లఘు చిత్రాన్ని కేవలం నటి నటుల దగ్గర ఉన్న ఐ ఫోన్ లతో షూట్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ చిత్రంలో తన కొడుకు తో పాటుగా యువ మలయాళ నటి, న్జాండుకలుడే నాటిల్ ఒరిడావెలా ఫేమ్ అహానా కృష్ణ ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు.సుహాసిని మని రత్నం లేటెస్ట్ గా ఎంత మంచివాడవురా లో నటించి మెప్పించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: