తెలంగాణ‌లో రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను వ‌చ్చే జూన్‌ రెండో వారంలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్‌ గురువారం మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభమవుతుందని వెల్లడించారు. పదో తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల మూల్యాంకనంపై గురువారం అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు సంబంధించి మొత్తంగా 53,10,543 జవాబు పత్రాల మూల్యాకనం చేయాల్సి ఉందని, అవన్నీ ఈనెల 30వ తేదీ వరకు పూర్తవుతాయన్నారు. జూన్‌ రెండో వారంలో ద్వితీయ సంవత్సర ఫలితాలను, మూడో వారంలో ప్రథమ సంవత్సర ఫలితాలను ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. మొదట ఇంటర్‌ ద్వితీయ సంవత్సర జవాబు పత్రాల మూల్యాంకనాన్నే చేపడతామన్నారు.

 

ఇక‌ లాక్‌డౌన్‌తో వాయిదా పడిన ఇంటర్మీడియట్‌ మోడర్న్‌ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలను ఈ నెల 18న నిర్వహిస్తామ‌ని తెలిపారు. ఆ విద్యార్థులు 861 మంది ఉన్నారని, ఆ పరీక్షల నిర్వహణకు 17 కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం 12 స్పాట్‌ కేంద్రాలుండగా, భౌతిక దూరం పాటిస్తూ 33 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో రోజూ 600 నుంచి 700 మంది మూల్యాంకనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: