దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న తరుణంలో తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంచుతున్నట్టు ప్రకటన చేశారు. సీఎం పళనిస్వామి ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయస్సును ఏడాది పెంచారు. దీంతో రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు 59 సంవత్సరాలకు పదవీ విరమణ చేయనున్నారు. తక్షణమే వయోపరిమితి పంపు అమలులోకి వస్తుందని పళనిస్వామి తెలిపారు. 
 
సీఎం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులు, రవాణా, విద్యుత్ శాఖల ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. సీఎం తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమిళనాడులో నిన్న ఒక్కరోజే 580 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 5409కు చేరింది. 
 
1,547 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 37 మంది మృతి చెందారు. తమిళనాడు వైద్య, ఆరోగ్య శాఖ ఈ విషయాలను వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: