ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల‌తో ఇరాన్ విల‌విలాడుతోంది. వంద‌లు, వేల‌సంఖ్యలో కేసులు, మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆ దేశంలో భూకంపం కల‌క‌లం రేపింది. ఇరాన్‌లో గత‌ రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది.  ఈ భూకంప ధాటికి ఒకరు మృతిచెందగా మరో ఏడుగురు పౌరులు గాయపడ్డారు. ఇరాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి కైనూష్‌ జహన్‌పూర్‌ భూకంపం విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఈ ఉదయం వెల్లడించారు.

 

యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపిన వివరాల ప్రకారం రాజధాని నగరం టెహ్రాన్‌కు ఈశాన్యంగా ఉన్న దమవంద్‌లో 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌తో ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాగా, ఇరాన్‌లో కొత్త‌గా 14, 485 కొత్త‌గా క‌రోనా కేసులు న‌మోదు కాగా, 68మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,135కు చేరుకుంది. మ‌ర‌ణాల సంఖ్య 6,486కు చేర‌కుంది. ఇప్ప‌టివ‌ర‌కు 82,744 మంది క‌రోనా నుంచి కోలుకున్నట్లు  ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: