మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన రైలు ప్రమాదంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా స్పంది స్తూ...‘‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన విచారకరం. మృతులకు టుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. 

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌- జల్నా మధ్య ఈరోజు ఉదయం 6:30 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగ‌తి తెలిసిందే. ట్రాక్‌పై నిద్రిస్తున్న కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది వలస కూలీలు మృతి చెందారు. చనిపోయిన వారిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. వలస కూలీలు మధ్యప్రదేశ్‌ నుంచి చత్తీస్‌గఢ్‌ వెళ్తున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారంతా రైల్వే ట్రాక్ పక్కనే కాలి నడకగా స్వస్థలాలకు వెళుతూ మార్గ మధ్యలో పట్టాలపై నిద్రించినట్లుగా సమాచారం.  రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కలచివేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: