మహారాష్ట్ర ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో 103 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు.  77 మంది ఖైదీలు, 26 మంది సిబ్బంది ఉన్నట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్​ముఖ్ మీడియాకు తెలిపారు.   పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే ఈ ఉదయం బాధితులందరినీ ముంబైలోని సెయింట్ జార్జ్,  గోకుల్ తేజ్ ఆసుపత్రులకు తరలించారు.   డ్రగ్ స్మగ్లింగ్ కేసులో ఇటీవల ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. అతడికి కరోనా వైరస్ సోకి ఉంటుందని, అతడి నుంచి మిగతా వారికి అది సంక్రమించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.   జైళ్లలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. ఏడేళ్ల లోపు జైలు శిక్ష పడిన 5,000 మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని దేశ్​ముఖ్ చెప్పారు. 

 

కాగా, 800 మంది మాత్రమే ఉండాల్సిన ఆర్థర్ రోడ్డు జైలులో ప్రస్తుతం 2600 మంది ఖైదీలు ఉండడంతో కిక్కిరిసిపోయింది. జైళ్లలో వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో చిన్న నేరాలతో జైలుకు వచ్చిన 11 వేల మందిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు.  ప్రస్తుతం దేశంలో ఎక్కువగా మహరాష్ట్రలో కరోనా కేసులు నమోదు కావడం.. మరణాల సంఖ్య పెరిగిపోవడం జరుగుతుంది.  ప్రపంచంలోనే అత్యంత పెద్దమురికివాడ ధారావిలో కూడా కేసులు ఆగడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: