దేశంలో మ‌ద్యం అమ్మ‌కాల‌పై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మ‌ద్యం హోమ్ డెలివ‌రీకి రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించింది. వైన్ షాపుల వ‌ద్ద భారీ జ‌న‌స‌మూహాన్ని అరిక‌ట్టేందుకు హోం డెలివ‌రీ అవ‌స‌ర‌మ‌ని కోర్టు ఈ సంద‌ర్భంగా అభిప్రాయ‌ప‌డింది. ఈ అంశంపై వేసిన పిల్‌పై స్పందిస్తూ సుప్రీం కోర్టు ఈ సూచ‌న‌లు చేసింది. నిజానికి.. ఈ కేసులో కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయ‌లేదు. భౌతిక దూరం అమ‌లు చేయాలంటే.. మ‌ద్యాన్ని హోం డెలివ‌రీ చేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ట్లు కోర్టు అభిప్రాయ‌ప‌డింది. జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్‌, సంజ‌య్ కృష్ణ కౌల్‌, బీఆర్ గ‌విల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఈ సూచ‌న చేసింది. కోర్టు ఈ కేసును వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా విచారించింది.

 

మార్చి 25వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ వ‌ల్ల మ‌ద్యం షాపులు మూత‌ప‌డ్డాయి. అయితే కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌లో స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో ప‌లురాష్ట్రాల్లో నాలుగు రోజుల నుంచి కొన్ని రాష్ట్రాలు మ‌ద్యం అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో జ‌నం ఒక్క‌సారిగా షాపుల ముందు బారులుతీరుతున్నారు. షాపులు తెర‌వ‌క‌ముందే.. కిలోమీట‌ర్ల కొద్ది క్యూలైన్లు ఉంటున్నాయి.  ఈ నేప‌థ్యంలోనే సుప్రీం కోర్టు ఈ సూచ‌న‌లు చేసిన‌ట్లు ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: