దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నాయి.  ఫిబ్రవరిలో మొదలైన ఈ కేసుల పరంపర ప్రతిరోజూ పెరిగిపోతున్నాయి.  అయితే దేశంలో మొదట కేరళాలో కరోనా కేసులు నమోదు కాగా అక్కడ ఇప్పుడు పూర్తి స్థాయిలో తగ్గిపోయాయి. రెండు రోజుల నుంచి అసలు అక్కడ జీరో కేసులు నమోదు అయ్యాయంటే ఎంతగా మెరుగు పడింతో తెలిసిపోతుంది.  ఇక ఇదే బాటలో  కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో ఉత్తరాఖండ్ సత్ఫలితాలు సాధిస్తోంది.

 

కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం  వరుసగా ఇది నాలుగో రోజు అని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం నాలుగు రోజుల నుంచి కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపింది.  కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి ఎన్నో ఆంక్షలు పెట్టి ప్రజలను చైతన్య పరుస్తూ వచ్చారు ఇక్కడ గవర్నమెంట్.

 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో గడచిన 24 గంటల్లో 3,390 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులునమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,273 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధిగ్రస్థుల రికవరీ రేటు 29.36కు చేరింది. దేశంలో ఇప్పటివరకూ 56,342 కేసులు నమోదు కాగా, 16,540 మంది కోలుకోగా, 1,886 మంది ప్రాణాలు కోల్పోయారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: