బాబ్రీ మసీదు కూల్చివేతపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఆగష్టు 31 లోపు విచారణ పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిని ఆదేశించింది. బాబ్రీ మసీద్ కూల్చివేతలో మురళీ మనోహర్, ఎల్ కె అద్వానీ, కళ్యాణ్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 28 సంవత్సరాల క్రితం కూల్చివేసిన బాబ్రీ మసీదు కేసులో బీజేపీ అగ్ర నేత ఎల్ కె అద్వానీ, మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తో పాటు 25 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. 
 
28 సంవత్సరాల నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. 1000 మందికి పైగా ఈ కేసులో సాక్ష్యులుగా ఉన్నారు. లాక్ డౌన్ వల్ల సుప్రీం కోర్టు స్పెషల్ కోర్టుకు మరో నాలుగు నెలలు గడువును పొడిగించింది. ఆగష్టు 31లోపు కేసు విచారణ పూర్తి చేయడంతో పాటు తీర్పు వెలువరించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు రెచ్చగొట్టి బాబ్రీ మసీదు కూల్చివేతకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఆగష్టు నెలలో ఈ కేసు భవితవ్యం తేలనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: