తెలంగాణ‌లో మహబూబ్‌నగర్‌ జిల్లాలో గ‌త‌ నెల రోజుల నుంచి ఒక్క క‌రోనా వైర‌స్ పాజిటివ్‌ కేసుకూడా నమోదు కాలేదని రాష్ట్ర‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రకటించారు. కరోనా కట్టడిలో జిల్లా అధికారులు కష్టపడి పనిచేస్తున్నారని ఆయన అభినందించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా వైరస్‌పై ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చినవారికి క్వారంటైన్‌ ముద్ర వేయాలని, వారంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆయ‌న‌ విజ్ఞప్తి చేశారు. వారి వివరాలను రిజిస్టర్‌లో‌ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

 

ప్రతిఒక్కరు లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలని, పట్టణాలు, గ్రామాల్లో గుంపులుగా ఉండొద్దని ఆయ‌న‌ సూచించారు. లాక్‌డౌన్‌లో సహకరించిన దాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో మాదిరిగానే మున్సిపాలిటీల్లో వార్డు కమిటీలు వేయాలని మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ సూచించారు. మున్సిపల్‌ పట్టణాల్లో 50 శాతం దుకాణాలను తెరవాలని ఆయ‌న సూచించారు. నారాయణపేట జిల్లాలో కూడా కఠిన చర్యలు తీసుకోవడంతోనే కరోనాను కట్టడి చేయగలిగామని ఈ సంద‌ర్భంగా మంత్రి వెల్లడించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: