IHG

 

కేజీఎఫ్ సినిమా ద్వారా తన స్టామినా ని నిరూపించుకున్న హీరో యష్. ఈ సినిమా ద్వారా యావత్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న యువ హీరో యష్. అయితే కేజీఎఫ్ చాఫ్టర్ 1 ద్వారా తన ఉన్నతిని చవిచూసిన హీరో కెజిఎఫ్ చప్టార్ 2 లో తన పతనాన్ని చవిచూడబోతున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కాలం నడుస్తున్నందున చిత్ర బృందం క్వారంటైన్ లో గడుపుతున్నారు.

IHG

 

ప్రస్తుతానికి యష్ కూడా తన కొడుకు ఆయుష్ మరియు కూతురు ఐరా తో క్వారంటైన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు...ముఖ్యంగా తన కూతురు ఐరా తో మంచి కాలక్షేపం చేస్తున్నాడు. ఈ సందర్భం గా జరిగిన ఓ వీడియోని యష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో చిన్నారి ఐరా తన తండ్రికి స్పూన్ తో గోరుముద్దలు తినిపిస్తూ కనిపించింది.....ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.....

మరింత సమాచారం తెలుసుకోండి: