ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని బెజ‌వాడ సీపీ ద్వార‌క తిరుమ‌ల‌రావు పోలీసుల‌కు షాక్ ఇచ్చారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌ను స‌స్పెండ్ చేశారు. ఇంత‌కీ వారు ఏం త‌ప్పు చేశార‌ని అనుకుంటున్నారా..?  లాక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి, అక్ర‌మంగా మ‌ద్యం క‌లిగి ఉండ‌డమే..! ఈ విష‌యం తెలియ‌గానే.. సీపీ వెంట‌నే వారిని స‌స్పెండ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీస్ అధికారులు విచార‌ణ చేప‌డుతున్నారు. కానిస్టేబుళ్లు  ర‌ణ్‌కుమార్, న‌రేశ్‌లు లాక్‌డౌన్ నిబంధ‌ల‌ను ఉల్లంఘించి మ‌ద్యం క‌లిగి ఉన్నారు. ఈ విష‌యం కాస్త బ‌య‌ట‌కు పొక్క‌డంతో విష‌యం వైర‌ల్ అయింది. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న సీపీ ప్రాథ‌మిక విచార‌ణ చేప‌ట్టి వెంట‌నే వారిన స‌స్పెండ్ చేశారు.

 

సీపీ ఆదేశాల‌తో పోలీసులు ఉలిక్కిప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై కృష్ణ‌లంక పోలీసులు స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల‌ని సీపీ ఆదేశించారు. ఓవైపు క‌రోనా క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న లాక్‌డౌన్ అమ‌లులో పోలీసుల‌పై దేశ‌మంతా ప్ర‌శంస‌లు కురిపిస్తున్న వేళ‌.. ఇలాంటి ప‌నులు ఏమిటంటూ సీపీ గ‌ట్టిగానే మందలించిన‌ట్లు తెలుస్తోంది. ఈ హెచ్చ‌రిక‌ల‌తో బెజ‌వాడ పోలీసులు వ‌ణికిపోతున్న‌ట్లు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: