ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ నేడు విశాఖ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీని ఆయ‌న స్వ‌యంగా ప‌రిశీలించ‌నున్నారు. అలాగే.. కేజీహెచ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న గ్యాస్ లీకేజీ బాధితుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించ‌నున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న పోలీస్ ఉన్న‌తాధికారుల‌తో డీజీపీ స‌మావేశం కానున్నారు. అయితే.. డీజీపీ ప‌ర్య‌ట‌న అనంత‌రం ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వానికి నివేదిక అందించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, దాని ఆధారంగా రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కంపెనీపై కేసు కూడా న‌మోదు అయింది. అంతేగాకుండా.. నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ చాలా సీరియ‌స్ అయింది. ఏకంగా రూ.50కోట్లు చెల్లించాల‌ని కూడా ఆదేశించింది.

 

ఆర్ ఆర్ వెంక‌టాపురం గ్రామ స‌మీపంలోని ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న భ‌యాన‌క ప‌రిస్థితుల‌ను సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో వంద‌లామంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఇప్ప‌టికే 12మంది మ‌ర‌ణించారు. కేజీహెచ్‌, ప‌లు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బాధిత కుటుంబాల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం.. రూ.30కోట్ల ప‌రిహారాన్ని విడుద‌ల చేశారు. అయితే.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: