IHG


కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నేడు  కరోనా రోగుల డిశ్చార్జ్‌ పై తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. మైల్డ్‌, వెరీ మైల్డ్‌, ప్రీ సింప్టమాటిక్‌ వంటి లక్షణాల్తో హాస్పిటల్ లో జాయిన్ అయిన రోగులను ప్రతి క్షణం వారి నాడి వ్యవస్థ పనితీరు ను పరీక్షించాలని తెలిపింది..అదేవిధంగా జ్వరం ను కూడా ప్రతి రోజూ చెక్ చేయాలనీ సూచింది. అయితే ఈ సందర్భంగా డిశ్చార్జ్ చేయాలంటే కచ్చితంగా కొరోనా లక్షణాలు తగ్గిన 10 రోజుల తరువాత రోగిని డిశ్చార్జ్‌ చేయొచ్చని తెలిపింది. అయితే ఈ పదిరోజుల్లో రోగికి వరుసగా 3 రోజులు జ్వరం వచ్చి ఉండకూడదు.

 

 

అదేవిధంగా రోగిని డిశ్చార్జ్‌ చేసే టైం లో అతనికి పరీక్షలు నిర్వహించకూడదు. డిశ్చార్జ్‌ అయిన వ్యక్తి 7 రోజుల వరకు హోమ్ క్వారంటైన్ లో బయటకు రాకుండా ఉండవలసి ఉంటుంది. ఆరోగ్యశాఖ సూచించిన విధంగా సదరు వ్యక్తికి తగిన సలహాలు, సూచనలను ఇవ్వాలంది. అయితే హాస్పిటల్ కి వస్తున్నా కోవిడ్-19  రోగులను వారి స్థితిని బట్టి ఆ కేసులను మోడరేట్ చేయాలని చెప్పింది. మోడరేట్‌ కేసుల్లో మూడు రోజులుగా జ్వరం లేకుండా ఉండడం అదే సమయంలో  నాలుగు రోజులపాటు ఆక్సిజన్‌ సపోర్ట్‌ లేకుండా 95 శాతం సంతృప్త స్థాయిని కలిగిఉంటే అటువంటి రోగులను 10 రోజుల తర్వాత డిశ్చార్జ్‌ చేయొచ్చని పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: