IHG

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న వేళ ఈ వైరస్ పై నానా రకాల పరిశోధనలను జరుపుతున్నారు. ఇప్పటివరకు సరైన పద్దతిని వైద్యులు కనుగొనలేదు అయితే తాజాగా కొరోనా కి సంబంధించి 127 మంది రోగుల పై హాంకాంగ్ వైద్య శాస్త్ర బృందం ప్రయోగాలు జరిపింది. తాజాగా 127 మంది రోగులకు మూడు రకాల యాంటీ వైరస్ ఔషధాలు కలిపి ఇచ్చి చూశారు. హెపటైటిస్ మందు రిబావైరిన్, హెచ్ఐవీ మందు రిటోనావిర్,  మల్టిపుల్ స్క్లెరోసిస్ మందు ఇంటర్‌ఫెరాన్-బీటాల మిశ్రమాన్ని తేలికపాటి నుంచి ఓమోస్తరు వరకు కరోనా లక్షణాలు ఉన్న 127 మందికి ఇచ్చారు.

 

 

అయితే సాధారణ నియంత్రిత బృందానికి మాత్రం కేవలం హెచ్ఐవీ డ్రగ్ ని మాత్రమే ఇచ్చి చూసింది,  అయితే 5 రోజుల తేడా తో రోగులు ఈ ఔషదాల వల్ల కోలుకున్నట్లు తెలియజేశారు. నియంత్రిత బృందం 12 రోజులు ల్లో రికవరీ అవ్వగా ద్రివిధ ఔషదాలు పొందిన కరోనా రోగులు కేవలం 7 రోజులకే కోలుకున్నారు.  లక్షణాలు బయటపడిన అనతికాలంలోనే త్రివిధ యాంటీ-వైరల్ డోసులు ఇస్తే వైరస్ చాలావరకు తగ్గిపోతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ప్రొఫసర్ కవోక్-యుంగ్ యుయెన్ తెలిపారు. అయితే ఈ తాజా పరిణామం చాలాబాగుంది శాస్త్రవేత్తలు సంతోషిస్తున్నారు. అయితే ఈ విషయమై విస్తృత పరిశోధన అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: