దేశంలో కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది ప్రజలు మాత్రం లాక్ డౌన్ అస్సులు పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు.  పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ  ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్డుపైకి వస్తున్నారు.  ముఖ్యంగా ఆదివారం పూట మాంసం దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా చేరి కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మంత్రి హారీష్ రావు మాంసం ప్రియులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గం సిద్ధిపేటలో ఈరోజు గ్యాదరి బాల్ రాజ్ జ్ఞాపకార్థం కరుణ క్రాంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1400 మందికి నిత్యావసర వస్తువులను సరఫరా చేశారు. ఈ కార్యక్రమానికి హరీశ్ రావుతో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 

కరోనా వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రూ. 1500 నగదు, 12 కిలోల బియ్యం ఇచ్చామని చెప్పారు. రెండవ దశలో మరో రూ. 1500 కూడా ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇంట్లో ఉంటున్నారు.. బయటకు వెళ్లి పనులు చేయడం లేదు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు కూడా కష్టంగానే ఉంటాయి.. అందుకే ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. సిద్ధిపేట గ్రీన్ జోన్ లో ఉందని ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని హరీశ్ అన్నారు. సామాజిక దూరం పాటించకుండా గుమికూడవద్దని... మాంసం కోసం వెళ్లి రోగం తెచ్చుకోవద్దని హితవు పలికారు. మాస్క్ లేకుండా బయట తిరిగితే రూ. 1000 జరిమానా తప్పదని హెచ్చరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: