క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్న కొవిడ్‌వారియ‌ర్స్ సంఖ్య రోజురోజుకూ అధిక‌మ‌వుతోంది. ఇందులో ప్ర‌ధానంగా వైద్యులు, న‌ర్సులు ఎక్కువ‌గా ఉంటున్నారు. ఇందులోనూ మ‌హారాష్ట్ర‌లోనే కొవిడ్‌వారియ‌ర్స్ వైర‌స్‌బారిన ఎక్కువ‌గా ప‌డుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో మహారాష్ట్ర పోలీసుశాఖకు చెందిన 714 మంది పోలీసులకు క‌రోనా పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర పోలీస్ శాఖ తెలిపింది. ప్రస్తుతం 648 మంది పోలీసులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 61 మంది క‌రోనా నుంచి కోలుకోగా, కరోనా వల్ల ఐదుగురు పోలీసులు మృతి చెందారు.  

 

లాక్‌డౌన్  సమయంలో పోలీసులపై 194 దాడులు జరిగాయని, దీనికి సంబంధించి 689 మంది నిందితులను అరెస్టు చేశామని పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై మహానగరంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉంది. కాగా, దేశంలోనే మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 19000పైగా చేరుకుంద‌ని అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇక భార‌త్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 60,000 మార్కుకు చేరుకుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: