IHG's Last Film Shot At <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=WUHAN' target='_blank' title='wuhan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>wuhan</a> Bats Market

 

హృదయ కాలేయం సినిమాతో బర్నింగ్ స్టార్ గా ముద్రవేసుకున్న హీరో సంపూర్ణేష్ బాబు. కొబ్బరి మట్ట సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు సంపూ. తాజాగా ఓ మెడికల్ హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ను సంపూ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు ఈ చిత్ర యూనిట్. ఈ పోస్టర్స్ లో సంపూ గన్ పట్టుకుని ఓ డాన్ లా కనిపించాడు. అయితే ఈ సినిమాగురించి ఓ ఆసక్తికర విషయం చిత్ర యూనిట్ బయట పెట్టించి.

 

 

అదేంటంటే కరోనా వైరస్ పుట్టినిల్లు అయినటువంటి వూహన్ నగర గబ్బిలాల మార్కెట్ లో ఈ సినిమా షూటింగ్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. హృదయ కాలేయం ,కొబ్బరి మట్ట సినిమాల నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలియ జేస్తున్నారు. నొలన్ మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా   విదేశాల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో ,ఒళ్ళు గగుర్పొడిచే  గ్రాఫిక్స్ తో రూపొందిన‌ట్టు సంపూ చెప్పారు. చిత్ర టైటిల్ ఏంట‌నేది స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంచారు. అయితే అభిమానులు ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు ... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: