ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆదాయ మార్గాల మీద సిఎం వైఎస్ జగన్ దృష్టి పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా వైరస్ లాక్ డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆర్ధికంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపధ్యంలో కరోనా పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.

 

వచ్చే వారం ఏపీ కేబినేట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కరోన తీవ్రతతో పాటుగా తీసుకోవాల్సిన చర్యలు కేంద్రం సహాయం సహా విశాఖ గ్యాస్ ప్రమాదం గురించి చర్చించే అవకాశం ఉంది. అలాగే వలస కార్మికుల గురించి కూడా చర్చించే సూచనలు కనపడుతున్నాయి. సినిమా హాల్స్ గురించి కూడా అప్పుడే నిర్ణయం తీసుకుంటారు. లాక్ డౌన్ ని మే 29 వరకు పెంచే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: