ఓ వైపు సినీ ఇండస్ట్రీలో బిజీగా ఉంటూనే రాజకీయాలపై తనదైన మార్క్ చాటుకుంటున్నారు పవన్ కళ్యాన్. అంతే కాదు గత కొంత కాలంగా   పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న పలు సమస్యల పై స్పందిస్తున్నారు. నిన్న బండారు దత్తాత్రేయ తో పవన్ తాను ఫోన్ ద్వారా జరిపిన సంభాషణ పై పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ కు గవర్నర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి తో టెలీ సంభాషణ ఎంతో ఆప్యాయంగా కొనసాగిందని అన్నారు పవన్ కళ్యాన్. దత్తాత్రేయ ప్రజా సంబంధమైన అనేక విషయాలు మాట్లాడుతుంటారని, ఆయన మాటలు, ప్రజా జీవిత అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చని పవన్ వివరించారు.

 

తాజాగా పవన్ కల్యాణ్ ఇవాళ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయు  ఎంచుకున్నారు. మొక్కవోని వ్యక్తిత్వం, విలక్షణ రాజకీయ జీవితం, అమ్మభాషపై అమితమైన మక్కువ, చతురత నిండిన మాటలు ఆయన సొంతం, ఆయనెవరో కాదు గౌరవనీయ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు అంటూ ట్వీట్ చేశారు. ఏ విషయంలోనైనా నిర్భయంగా, మొహమాటం లేకుండా మాట్లాడడం వెంకయ్యనాయుడు నైజం అని, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తుందని తెలిపారు. ఆయన ఇచ్చే గౌరవమైన సలహాలు, సూచనలు సర్వదా ఆచరణీయాలని, ఆయనకు వినయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: