చైనాలోని పుహాన్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రళయ తాండవం చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా లక్ష కు పైగా మరణాలు, కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచంలో ఎంత గొప్ప టెక్నాలజీ ఉన్నా దేశాలు సైతం కరోనాని భయపడిపోయే పరిస్థితి వచ్చింది.  ఇక దీని విరుగుడు కనిపెట్టేందుకు ఎంతో మంది రక రకాల ప్రయోగాలు చేస్తున్నారు.  అయితే ఎవరూ ఇప్పటి వరకు సరైనా యాంటీ డోస్ కనిపెట్టలేకపోయారు.  కరోనా విరుగుడు కోసం ఓ ప్రయోగం చేసి అది కాస్త వికటించడంతో తన మందు తానే తాగి ఓ ఆయుర్వేద డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.  పెరుంగుడి ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల శివనేశన్ చెన్నైలోని సుజాతా బయోటెక్ అనే ఆయుర్వేద సంస్థలో పనిచేస్తున్నాడు.

 

సుజాతా బయోటెక్ సంస్థ 30 ఏళ్లుగా ఆయుర్వేద వైద్య రంగంలో ఉంది. ఈ సంస్థకు ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ లో ఓ ప్లాంట్ కూడా ఉంది. శివనేశన్ అక్కడే పనిచేస్తున్నాడు.  దేశంలో ప్రభలిపోతున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఓ మందు కనిపిెట్టాలని చూశారు. చెన్నై వచ్చి సంస్థ ఎండీ డాక్టర్ రాజ్ కుమార్ (67) తో కలిసి ప్రయోగాలు చేపట్టాడు. మందు తయారు చేసిన తర్వాత శివనేశన్ తో పాటు సంస్థ ఎండీ కూడా ఆ మందును తాగారు.  ఈ ప్రయోగం ఎవరూ తమపై ప్రయోగం చేసుకోకపోవడంతో వారిద్దరే ధైర్యం చేశారు. ఆ మందు కాస్త వికటించింది. దాంతో శివనేశన్ చికిత్స పొందుతూ మరణించగా, ఎండీ జ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: