టాలీవుడ్‌కు రాజ‌కీయాల‌కు విడ‌దీయ‌లేని వీడిపోని బంధ‌ముంది. అనేక మంది టాలీవుడ్ ప్ర‌ముఖులు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పాల‌నాశ‌క్తిని చాటిచెప్పారు. ప్ర‌జ‌ల్లో త‌మదైన ముద్ర‌వేశారు. కొద్దిరోజులు యంగ్ హీరో మోహ‌న్‌బాబు చిన్న‌కుమారుడు మంచు మ‌నోజ్‌ కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. అయితే.. దీనిపై తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహ‌న్‌బాబు ఈ విష‌యంపై స్పందించారు. దేనినైనా సూటిగా సుత్తిలేకుండా చెప్ప‌డంలో ఆయ‌న స్టైలే వేరు..! మ‌నోజ్ పొలిటిక‌ల్ ఎంట్రీ విష‌యంపై కూడా అలాగే స‌మాధానం చెప్పారు. మనోజ్ రాజకీయాల్లోకి వచ్చే అంశంపై అతడినే అడగాలని అన్నారు.

 

అయితే తనను అడిగితే మాత్రం రాజకీయాల్లోకి రావొద్దని అతడికి సలహా ఇస్తానని మోహన్ బాబు చెప్పారు.  రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదని మోహన్ బాబు అన్నారు. అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని అన్నారు. రాజకీయాల్లో తనకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తున్నానని ఆయ‌న‌ వివరించారు. సినిమాల్లో విష్ణు, మనోజ్ ఇద్దరూ సక్సెస్ అయ్యారని మోహన్ బాబు అన్నారు. మంచు లక్ష్మీ తనకు నచ్చిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతోంద మోహ‌న్‌బాబు క్లారిటీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: