టాలీవుడ్‌ సూపర్ స్టార్లలో ఒక‌రు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. న‌ట‌న‌లో, డ్యాన్స్‌లో.. డైలాగ్ డెలివ‌రీలో ఫుల్ ఎన‌ర్జిటిక్‌గా ఉంటాడు. ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించి, తెలుగు చిత్ర‌సీమ‌లో స్టార్ హీరోగా ఎదిగారు. మే 20న‌ జూనియర్ ఎన్టీఆర్‌ పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టి నుంచే ఇండ‌స్ట్రీలో సంద‌డి మొద‌లైంది. అభిమానులు ఆ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే  అభిమానులు డీపీతో సోషల్ మీడియాలో పుట్టినరోజు వేడుకల సంద‌డి మొద‌లుపెట్టారు. దీనిని ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల‌లో ఈ డీపీ వైర‌ల్ అవుతోంది.

 

ఇక్క‌డ మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే..  జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, పలువురు టాలీవుడ్ తారలు కలిసి కామ‌న్‌ డీపీని విడుదల చేశారు. వేలాది మంది అభిమానులు తమ అభిమాన ఫోటోలు, వీడియోలతో సంద‌డి చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా డీపీని పోస్ట్ చేస్తూ ద‌గ్గుబాటి ఇలా కామెంట్ చేశారు.. ఇది నంద‌మూరి తార‌క రామారావు కోసం అంటూ ట్వీట్ చేశారు. అలాగే.. కాజ‌ల్ అగ‌ర్వాల్, నివేదా థామ‌స్‌, నిధి అగ‌ర్వాల్‌, దేవిశ్రీ‌ప్ర‌సాద్ త‌దిత‌ర ప్ర‌ముఖులు ట్విట్ట‌ర్‌లో పోస్ట్‌లు పెట్టారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: