ప్ర‌పంచ దేశాల‌తో పోల్చితే భార‌త్‌లో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు త‌క్కువ‌గానే జ‌రుగుతున్నాయి. భార‌త్ జ‌నాభాలో నాలుగో వంతు జ‌నాభా క‌లిగిన అమెరికాలో భార‌త్‌లో క‌న్నా ఆరురెట్లు ఎక్కువ‌గా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న‌ట్లు అధికావ‌ర్గాలే వెల్ల‌డిస్తున్నాయి. ప్ర‌స్తుతం భార‌త్‌లో కొవిడ్ -19 నిర్ధార‌ణ‌ పరీక్షల‌ సామర్థ్యం రోజుకు 95,000 వరకు ఉంటుందని కేంద్ర‌ ఆరోగ్య శాఖ‌ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ వెల్ల‌డించారు. అంతేగాకుండా.. ప్ర‌పంచ‌లోనే అతి త‌క్కువగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్న దేశాల్లో భార‌త్ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. అంటే.. ఇంకా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో వేగం పెంచాల్సిన అవ‌సరం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు.

 

ఎంత వేగంగా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తే.. అంత‌త్వ‌ర‌గా వైర‌స్ వ్యాప్తిని నియంత్రించ‌గ‌లిగే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, భారతదేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 59,662 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో వ‌రుస‌గా మూడో రోజు 3వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 3,294 తాజా కేసులు నమోదయ్యాయి. ఇక దేశ‌వ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 1,981కు చేరుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: