IHG

 

 

కాజల్, జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనం, బాద్ షా, టెంపర్ వంటి సినిమాలు చేసింది. ఆన్ స్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉన్నప్పటికీ ఆఫ్ స్రీన్ మటుకు వీరు మంచి స్నేహితులు.తాజా గా ఈ అమ్మడు జూనియర్ ఎన్టీఆర్ కి ఓ పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యింది. అదేంటి ఎన్టీఆర్ కి ఆల్రెడీ పేరుందిగా మరో పేరెందుకు అంటారా .. మే 20 వ తారీఖున ఎన్టీఆర్ బర్త్ డే వస్తున్నందున అభిమానులు ఇప్పటినుండే సందడి మొదలెట్టారు. బర్త్ డే కి ఇంకో 10 రోజులు ఉన్నందున అభిమానులు తెగ సంబరాలు చేస్తున్నారు.

 

 

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కోసం కళ్లు  కాయలు కాసేలా అభిమానులతో పాటు కాజల్ కూడా ఎదురు చూస్తోంది. అయితే jr ఎన్టీఆర్ కి అడ్వాన్స్డ్ బర్త్ డే విషెస్ తెలుపుతూ ఎన్టీఆర్ కి  తరామి అని పేరు పెట్టింది. అయితే దీనికి అసలు అర్థం ఏంటంటే తారక్ ఒక సునామి అని తెలిపింది.  తారక్ ని చూస్తుంటే ఓ సునామీలా కనిపిస్తున్నాడని.. తారక్ అని పిలవడం కంటే తరామి అని పిలవడం చాల కరెక్ట్ అని పేర్కొంది. అయితే ఈ విషయాలను తన ట్విట్టర్ ఖాతా నుండి జూనియర్ ఎన్టీఆర్ కి ట్యాగ్ చేసింది. ఈ సంవత్సరం jr ఎన్టీఆర్ కి కలసి రావాలని కొరుకుంటున్నట్లు తెలిపింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: