సాధారణంగా భారత్ ఎప్పుడైనా ఇతర దేశాలకు సహాయపడే ధోరణితోనే వ్యవహరిస్తుంది. చినాబ్ నది నుంచి పాక్ కు నీళ్లు వెళుతున్నా భారత్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మన భిక్షతో బ్రతుకుతున్న పాక్ మనపై కుట్రలకు పాల్పడుతోంది. పాక్ లో పండే పంటలలో 40 నుంచి 50 శాతం చినాబ్ నదిపై ఆధారపడి పండుతున్న పంటలే కావడం గమనార్హం. 
 
అయితే తాజాగా పంజాబ్ పాక్ కు షాక్ ఇచ్చింది. చినాబ్ నది నుంచి నీటి ప్రవాహాన్ని ఆపివేసి అక్కడినుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పంజాబ్ సిద్ధమైంది. ఆ నీటిని మన దేశం వాడుకోవడం ప్రారంభించింది. భారత్ నిబంధనల ప్రకారం కేవలం 20 శాతం నీటిని మాత్రమే పాక్ కు వదలనుంది. గతంలో 14,000 క్యూసెక్కుల నీటిని భారత్ నుండి వదిలేవారు. ఆ నీటిని భారత ప్రభుత్వం పంజాబ్, రాజస్థాన్ లో ఉన్న 5 లక్షల ఎకరాల కోసం ప్రభుత్వం మళ్లించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: