ఓ వైపు ప్ర‌పంచం అంతా క‌రోనా మ‌హ‌మ్మారితో విల‌విల్లాడుతుంటే చైనా మాత్రం ఇప్ప‌టికే భ‌, స‌ముద్ర ఆక్ర‌మ‌ణ‌లు చాల‌వ‌న్న‌ట్టుగా ఇప్పుడు అంత‌రిక్షంలో త‌న కార్య‌క్ర‌మాలు తాను స్టార్ట్ చేసింది. తాజా అంత‌ర్జాతీయ నివేదిక‌ల ప్ర‌కారం చైనా స్పేస్ వాహ‌కం మంగోలియ‌యా స్వ‌యం ప్ర‌తిప్ర‌త్తిత ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్ప్ (CASTC) ప్రకారం, స్పేస్ ఫ్లైట్ మూడు రోజుల పాటు క‌క్షను చుట్టి వ‌చ్చింది. ఈ కొత్త వ్యోమనౌక చైనా యొక్క షెన్‌జౌ అంతరిక్ష నౌకను వ్యోమగాములను భూమి కక్ష్యలోని ఒక అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లేందుకు రూపొందించబడింది.

 

ఈ వ్యోమనౌక 2 రోజుల‌ 19 గంటలు కక్ష్యలో గడిపినట్లు CASTC తెలిపింది. క్యాప్సూల్ శుక్రవారం క‌క్ష్య‌లోకి ప్ర‌వేశించి త‌న ల‌క్ష్యాన్ని పూర్తి చేసిన‌ట్టు స‌మాచారం. నౌక మాడ్యూల్లో 9 కిలోమీట‌ర్ల కంటే ఎక్కువ వేగంతో వాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి మినహాయించబడిన తరువాత చైనా శాశ్వత కక్ష్య స్టేషన్‌లో పనిచేస్తోంది, గతేడాది చంద్రుడికి చాలా దూరంలో ఒక అంతరిక్ష నౌకను ల్యాండ్ చేయడం ద్వారా చైనా ఇప్పటికే ఒక పెద్ద మైలురాయిని సాధించింది.

 

ఇక ఇప్పుడు మార్క్ ల్యాండ‌ర్‌తో పాటు రోవ‌ర్‌ను పంపాల‌ని చూస్తోంది. ఏదేమైనా చైనా 2022 నాటికి త‌న అంత‌ర‌క్షి కేంద్రం పూర్తి చేసే ల‌క్ష్యంగా దిశ‌గా వెళుతోంది. ఇప్ప‌టికే క‌రోనాను ప్ర‌పంచానికి అంటించి ప్ర‌పంచం అంతా విల‌విల్లాడుతుంటే చైనా మాత్రం అంత‌రిక్షంలో త‌న ప‌ని తాను చేసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: