కరోనా లాక్ డౌన్ కారణంగా ఇతర దేశాల్లో ఉండి చిక్కుకుపోయిన భారతీయులను ఇక్కడికి తీసుకొచ్చేందుకు గానూ కేంద్ర సర్కార్ వందే భారత్ మిషన్ ని కొనసాగిస్తుంది. ఇతర దేశాల్లో ఉండి ఇబ్బందులు పడుతున్న వారిని శనివారం రెండు ఎయిర్ ఇండియా విమానాలు బయల్దేరి వెళ్ళాయి. ఈ రెండు విమానాలకు నాయకత్వం వహించింది మహిళా కెప్టెన్ లే. 

 

తిరుచిరాపల్లి, కౌలాలంపూర్ విమానానికి కెప్టెన్ కవితా రాజ్ కుమార్ నాయకత్వం వహిస్తుండగా కొచ్చి మస్కట్ విమానానికి కెప్టెన్ బిందూ సెబాస్టియన్ నాయకత్వం వహిస్తున్నారు. ఇక వందే భారత్ మిషన్ లో తీసుకొచ్చిన వారిని అందరిని క్వారంటైన్ కి తరలిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి ప్రభుత్వాలు.వారిలో కరోనా బయటపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: