తెలంగాణాలో పెయిడ్ క్వారంటైన్ మొదలయింది. విదేశాల నుంచి వచ్చిన వారిని పెయిడ్ క్వారంటైన్ కి తరలిస్తారు. కువైట్ నుంచి వచ్చిన 163 మందిని క్వారంటైన్ చేసారు. గచ్చిబౌలీ, కాచిగూడ వద్ద హోటల్స్ లో పెయిడ్ క్వారంటైన్ చేసారు. వృద్దులు చిన్నారులను హోం క్వారంటైన్ చేస్తారు అధికారులు. 

 

అమెరికా నుంచి వచ్చే వారిని కూడా క్వారంటైన్ కి తరలిస్తారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తారు. 14 రోజులకు గానూ 30 వేల వరకు చార్జ్ చేస్తారు. కాగా నిన్న సాయంత్రం కువైట్ నుంచి వందే భారత్ మిషన్ లో భాగంగా భారతీయులు వచ్చిన సంగతి తెలిసిందే. వారికి కరోనా సోకే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: