దేశంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇతర దేశాలతో పోల్చితే.. లాక్ డౌన్ వల్ల దేశంలో కరోనా భారీగా విస్తరించకుండా కంట్రోల్ చేస్తున్నా.. రోజూ కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. ఇటీవల దేశంలో లాక్ డౌన్ కొన్ని సడలింపులు ఇచ్చారు.  మద్యం షాపులు, మరికొన్ని షాపులు తీయడానికి పరిమిషన్ ఇచ్చారు.  దాంతో మళ్లీ జనాలు మామూలుగా రోడ్లపై తిరగడం మొదలు పెట్టారు.  తెలంగాణలో ఇప్పుడు రూల్స్ బ్రేక్ చేసేవారి తాట తీస్తున్నారు పోలీసులు. 

 

హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రమూ తగ్గకపోవడంతో లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు అధికారులు, పోలీసులు కదిలారు. అనవసరంగా బయటకు వచ్చిన వారి తాట తీస్తున్నారు.  రూల్స్ బ్రేక్ చేస్తున్నవారిని గట్టిగానే ఫైన్ల రూపంలో బాదుతున్నారు. జనసంచారం ఒక్కసారిగా పెరగడంతో వైరస్ వ్యాప్తికి అవకాశాలు చిక్కినట్లయింది. ఐటీ కంపెనీలు సైతం 33 శాతం ఉద్యోగులతో పనులు ప్రారంభించాయి. 

 

నగరంలోని ప్రధాన కూడళ్లు, జంక్షన్లలో పికెటింగ్ ను ఏర్పాటు చేసి, తనిఖీలు ముమ్మరం చేశారు. లాక్ డౌన్ నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అయితే సడలింపులు ఉన్న వారిని మాత్రమే పోలీసులు వదిలేస్తున్నారు. రాష్ట్రంలో రవాణా, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు నిర్మాణ రంగానికి అనుమతులు ఇవ్వడం, మద్యం దుకాణాలు, ఉక్కు, సిమెంట్, ఎలక్ట్రికల్ దుకాణాలు తెరచుకోవడంతో ప్రజలు బయటకు రావడం పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: