దేశంలో కరోనా మహమ్మారి ఎప్పుడ్రైతే ప్రవేశించిందో అప్పటి నుంచి మనిషికి కంటిమిద కునుకు లేకుండా పోయింది. చైనాలోని పుహాన్ లో పురుడు పొోసుకున్న ఈ దిక్కుమాలిన కరోనా ఆర్థిక నష్టమే కాదు.. మనుషులు ప్రాణాలు పోతున్నాయి.  డబ్బు లేక పేద ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంత గ్రామానికి వెళ్లడానికి కూతురిని ఎత్తుకుని ఓ మహిళ 900 కిలోమీటర్ల ప్రయాణం ప్రారంభించింది.  ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన రుక్సానా బానో తన భర్త అఖ్విబ్‌తో కలిసి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంటోంది. అఖ్విబ్‌ ఒక హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. రుక్సానా  ఇళ్లలో పనిమనిషిగా పని చేస్తుంది. వీరిిక మూడేళ్ల చిన్నారి ఉంది. 

 

కరోనా కాలంలో వారి వద్ద ఉన్న డబ్బు పూర్తిగా అయిపోయింది. కూతురి చదువు కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బును తీయొద్దని ఆమె భావించింది. ఇండోర్‌లోనే ఉంటే తన కూతురు కూడా కరోనా బారిన పడుతుందేమోనని ఆమె భయపడింది.  ఆమె కాలినడక ప్రారంభించింది.. ఆమె భర్త ఇండోర్‌లోనే ఉన్నాడు. వారితో ఈ సమయంలో అమేథీకి రావడానికి ఒప్పుకోలేదు. 

 

మార్గమద్యలో ఆమెకు తెలిసిన వారు కలిసి కాస్త చెదోడు వాదోడుగా వచ్చారు.   మధ్యలో ఓ సారి ట్రక్కు, మరోసారి లారీని లిఫ్ట్‌ అడిగి వారంతా కలిసి కొంత దూరం ప్రయాణించారు. చివరకు యూపీ రాజధాని లక్నోకు చేరుకున్నారు. అక్కడ నుంచి తిరిగి ప్రయాణం మొదలు పెట్టింది.. ఇలా తొమ్మిది వందల కిలోమీటర్లు నడిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: