దేశంలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు కేంద్రం ఇంకా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఉన్నత స్థాయి సమీక్షలను, చర్యలను ఎప్పటికప్పుడు జరుపుతున్నారు. కరోనా తీవ్రత పెరగడంపై ఆందోళనలో ఉన్న మోడీ ఈ నెల 12 ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 

 

రాష్ట్రాలు కరోనా లాక్ డౌన్ ని అమలు చేస్తున్న విధానం, కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తీసుకునే చర్యలు, వలస కార్మికుల విషయంలో వ్యవహరించే వ్యూహాలు ఇలా అన్నీ కూడా వారితో చర్చించే అవకాశం ఉంది. లాక్ డౌన్ ని కొనసాగించాలా లేదా అనే దాని మీద కూడా ప్రధాని సిఎం లతో చర్చలు జరిపే అవకాశం ఉంది. దీనిపై వారి అభిప్రాయం తీసుకుంటారు. మే చివరి వరకు లాక్ డౌన్ ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: