తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో రేపటి నుంచి ప్లాస్మా థెరపీ చికిత్స అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో 15 మంది ప్లాస్మా దానం చేసేందుకు ఇప్పటివరకు ముందుకు వచ్చారు. మొదట్లో కరోనా సోకిన 15 మంది విదేశీయులు ప్లాస్మా దానం చేయడానికి సిద్ధం కావడంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు వారి నుంచి ప్లాస్మాను సేకరించనున్నారు. ఒక్కొకరి నుంచి 400 మి.లీ రక్తం సేకరించి రక్తం నుంచి ప్లాస్మా వేరు చేయనున్నారు. 
 
ఈ ప్రక్రియకు దాదాపు రెండు గంటల సమయం పడుతుందని సమాచారం. ప్రస్తుతం ప్లాస్మా థెరపీ తీసుకునేందుకు అర్హులైన రోగులు గాంధీ ఆస్పత్రిలో కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: