IHG

హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం. ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 8 సంవత్సరాలు కావస్తూవుండడంతో పవన్ ఫ్యాన్స్ ఓ అద్బుతమైన వీడియో తయారు చేశారు.  ఆ వీడియో సారాంశం ఏమిటంటే ..పవన్ కళ్యాణ్ హిట్ సినిమా ఖుషి వచ్చి ఇప్పటికి 19 సంవత్సరాలు .ఈ సినిమా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాల హ్యాపీగా ఉన్నారు ఆ తరువాత జానీ , గుడుంబా శంకర్, బాలు , బంగారం , అన్నవరం , కొమరం పులి , పంజా వంటి సినిమాలు వచ్చినప్పటికీ ఖుషి సినిమా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రానందుకు ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు .

 

 

అయితే హరీష్ శంకర్ దర్శకత్వం లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ రేంజ్ ని ఏకంగా పెంచేసింది...ఈ సినిమా తెచ్చిన సక్సెస్ తో  ఫ్యాన్స్ ఎక్కడలేని ఆనందంతో ఎగిరి గంతేశారు ఈ  సీన్ నాని నటించిన జెర్సీ మూవ్ మెంట్ ని తలపించింది...ఈ సందర్భంగా హరీష్ శంకర్ కి ఈ వీడియో ద్వారా విషెస్ తెలియజేస్తూ పవన్ ఫ్యాన్స్ ఈ వీడియో ని షేర్ చేశారు ...ఈ వీడియో చూసి ఫిదా అయిన హరీష్ శంకర్ ...ఆ వీడియో  హిలేరియస్ గా ఉన్నదని కామెంట్ చేస్తూ తానే స్వయంగా ఆ వీడియోని తన ట్విట్టర్ ఖాతా నుండి షేర్ కూడా చేశాడు ...ఈ వీడియో చుసిన పవన్ ఫ్యాన్స్ తెగ కామెట్స్ చేస్తున్నారు ...అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా మంచి హిట్ సాధించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు అదేవిధంగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ సినిమాని మరపించే విధంగా కలెక్షన్స్ రాబట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: