దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. ఏ విధంగా కరోనా కట్టడి చెయ్యాలని చూసినా సరే అది సాధ్యం కావడం లేదు. దాదాపు రెండు నెలల నుంచి లాక్ డౌన్ అమలులో ఉన్నా సరే కేసులు మాత్రం కంట్రోల్ అవ్వడం లేదు. ఇక మే నెల మొదటి పది రోజులు కరోనా ఏంటో చూపించింది. 

 

ప్రతీ రోజు మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో చుక్కలు చూపిస్తుంది. మే నెల పది రోజుల్లో 27 వేల కేసులు నమోదు అయ్యాయి. కరోనా మొదలైన నాటి నుంచి కూడా ఇది 40 శాతం అని కేంద్రం పేర్కొంది. రాబోయే రోజుల్లో దీని తీవ్రత ఇంకేస్తాయిలో ఉంటుందో అనే ఆందోళన మొదలయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: