దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి అన్ని మూసినేశారు.  ఫిబ్రవరి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం సినిమా థియేటర్లు మూతపడ్డాయి. లాక్ డౌన్ తరువాత సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో లాక్ డౌన్ తరువాత థియేటర్లకు పూర్వవైభవం తీసుకుని రావడానికి జంటనగరాల్లోని థియేటర్ యజమానులు కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. 

 

లాక్‌డౌన్ తర్వాత.. ప్రభుత్వం థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చేందుకు ముందే వైరస్ నిరోధానికి కొన్ని చర్యలు తీసుకున్నట్లు థియేటర్ యజమానులు పేర్కొన్నారు. 

ఇవే కొత్త రూల్స్ :

 ఒక షో ముగిసిన 45 నిమిషాల తర్వాత మరో షో మొదలుపెడతారు.

* పేపర్ టికెట్లకు చెక్ పెట్టనున్నారు. క్యూఆర్‌కోడ్‌తో ఉన్న టికెట్‌ను సెల్‌ఫోన్‌కు పంపిస్తారు.

* ‌టాయ్‌లెట్స్, ఫుడ్ స్టాల్స్ వద్ద భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు.

* ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకున్నప్పుడే ఒక సీటు తర్వాత మరో సీటు అందుబాటులో ఉండదు.

* ప్రతీ షో ముగియగానే అన్ని సీట్లను శానిటైజ్‌ చేస్తారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: