IHG

ఆఫ్ఘనిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ తాలిబన్ భరత్ తో స్నేహబంధాన్ని ఆకాంక్షిస్తుంది. భరత్ ఆ దేశంలో చేస్తున్న కొన్ని మంచి పనులకు గాను ఆ దేశ ఉగ్రవాద సంస్థ తాలిబన్ భరత్ తో సత్సంభందాలు కోరుకుంటుంది. ఈ సందర్భంగా భరత్ ని ఆఫ్ఘనిస్థాన్‌ లో సహాయక కార్యక్రమాలకు ఆహ్వానం పలికింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భరత్ మరియు ఇతర పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని వారు కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆఫ్ఘనిస్థాన్ పునర్‌నిర్మాణంలో భాగంగా భారత్‌ చేపడ్తోన్న సహాయ కార్యక్రమాలను స్వాగతిస్తున్నామని తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ తెలిపారు.

 

 

గతవారం ఢిల్లీలోఆఫ్ఘనిస్థాన్‌పై అమెరికా తరపున చర్చలు జరుపుతోన్న ప్రతినిధి జల్మాయ్ ఖలీల్‌జాద్ పర్యటించారు. విదేశాంగమంత్రి జై శంకర్‌తో మరియు  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో జల్మాయ్ ఖలీల్‌జాద్ చర్చలు జరిపారని సమాచారం. జల్మాయ్ ఖలీల్‌జాద్ ఈ చర్చలు చాల ప్రాముఖ్యమని తెలిపారు. అయితే ఇప్పటికే భరత్.. ఆఫ్ఘనిస్థాన్ లో పార్లమెంట్ భవనం మరియు కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ను నిర్మించడానికి పూనుకుంది. అయితే తాలిబన్ దుస్సాహసాలను ఇదివరకు మనం చూశాం. అయితే తాలిబన్ఈ  ప్రకటన మీద ఐనా నిలబడుతుందేమో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: