ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ సంఘటన తర్వాత దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిన సంగతి తెల్సిందే. దీంతో ముస్లింలు నిర్వహించే లేదా వారు పనిచేసే దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేయొద్దంటూ కొందరు దుండగులు దుష్ప్రచారం చేస్తున్నారు. భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు 3,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 127 మంది ప్రాణాలు కోల్పోయారు.  అంతే కాదు ఇప్పటి వరకు మృతుల సంఖ్య 2,109కి చేరింది. 

 

ఢిల్లీలోని ముజాహిద్దిన్ మర్కజ్ సమావేశంలో పాల్గొని వచ్చిన వారి  నుంచి ఎక్కువ కరోనా వ్యాప్తి జరుగుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైలోని టీ నగర్ లో ఉన్న ఓ బేకరీ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి జైన్ బేకరీస్ అండ్ కన్ఫెక్షనరీస్ పేరుతో బేకరీ షాపు నిర్వహిస్తున్నాడు. తమ షాపులోని తినుబండారాలన్నీ జైన మతస్థులు మాత్రమే తయారు చేసినవేనని, తమ వద్ద ముస్లింలు ఎవరూ పనిచేయడం లేదంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటనను ‘వాట్సప్’ ద్వారా తమ వినియోగదారులకు షేర్ చేశాడు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఇది కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ  యజమానిని అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: