దేశంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు జరుగుతుంది. కరోనా ఉన్నా లేకపోయినా సరే దేశంలో రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. దీనితో ఇప్పుడు ప్రభుత్వ కార్యాకలాపాలు కూడా వాయిదా పడ్డాయి. పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి అనేది కూడా తెలియదు. 

 

ఈ నేపధ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటన చేసారు. పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు ఉంటాయి అనే దాని మీద స్పందించిన ఆయన.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూన్ చివరి వారంలో లేదంటే జులై మొదటి వారంలో జరిగే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఇక అప్పటికి లాక్ డౌన్ ని పూర్తి స్థాయిలో ఎత్తేసే సూచనలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: