దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఇప్పుడు లక్ష దాటే రాష్ట్రాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. మహారాష్ట్రలో, గుజరాత్ లో, ఢిల్లీ లో, తమిళనాడు లో కరోనా కేసులు లక్ష దాటే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. మహారాష్ట్రలో కరోనా కేసులు 20 వేలు దాటాయి.

 

ఈ నెలలో అక్కడ లక్ష కేసులు నమోదు అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇక గుజరాత్ విషయానికి వస్తే అక్కడ 7 వేల కేసులకు పైగా నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో కూడా లక్ష నమోదు అయ్యే సూచనలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ లో అదుపులోకి వచ్చినట్టే వచ్చిన కరోనా మరీ వేగంగా పెరుగుతుంది. అక్కడ కూడా లక్ష కేసులు నమోదు అయ్యే సూచనలు ఉన్నాయి. ఇక తమిళనాడు లో కూడా 7 వేల కేసులు దాటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: