దేశంలో కరోనా వచ్చినప్పటి జనాలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది.  ప్రాణాంతకమైన కరోనా వైరస్‌పై గాంధీ వైద్యులు పోరాటం చేస్తూ మరోపక్క అత్యవసర సేవలో పాలు పంచుకుంటున్నారు. తాజాగా పాజిటివ్ వచ్చిన గర్భిణికి శస్త్ర చికిత్సలు చేసి సుఖంగా ప్రసవం చేశారు . సాదారణ కరోనా రోగులను కాపడడంలోనే కాకుండా కరోనా వచ్చిన గర్భిణికి సురక్షితంగా పురుడుపోసిన గాంధీ వైద్యులపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేఖాలు వెల్లువెత్తుతున్నాయి.  పాజిటివ్ ఉన్న గర్భిణిని ప్రసవం చేయాలంటే ఎంతో జాగ్రత్తలు తీసుకోని గాంధీ వైద్యులు వైద్యసేవలందించారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రత్యేక జాగ్రత్తల మధ్య ప్రసవం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తల్లి, బిడ్డల ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు చెప్పారు.  

 

ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వ్యాపిస్తున్న కరోనా వైరస్ గర్భవతులకు కూడా సోకుతోంది. బెంగళూరులో ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, వారిద్దరూ బిడ్డలకు జన్మనిచ్చారు. వారిలో 20 ఏళ్ల యువతి కవల పిల్లలకు జన్మనివ్వడం విశేషం.  బెంగళూరులోని పాదరాయణపురకు చెందిన ఆ యువతి నెలలు నిండడంతో ఈ నెల 7న బెంగళూరులోని వాణి విలాస్ ఆసుపత్రిలో చేరింది. అయితే పాదరాయణపుర ప్రాంతాన్ని ప్రభుత్వం అప్పటికే కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించింది. ఆ యువతి ఆసుపత్రి వర్గాలకు ఈ విషయాన్ని చెప్పకుండా దాచింది.

 

కానీ వారు ఆమెకు ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అటు ఆమె భర్త కూడా కరోనా పాజిటివ్ తో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఆ కవల శిశువులను కూడా అబ్జర్వేషన్ లో ఉంచారు. ఇక, 34 ఏళ్ల మరో మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు కూడా కరోనా నిర్ధారణ అయింది

మరింత సమాచారం తెలుసుకోండి: